Telangana : నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు
లంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. నేడు శాసనసభలో కులగణన తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది
telangana assembly today
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. నేడు శాసనసభలో కులగణన తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. ఉదయం పది గంటలకు సభలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. కులగణన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశ పెడతారు. అనంతరం నీటి పారుదల శాఖపై కూడా ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది.
కులగణన తీర్మానంపై...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 8వ తేదీన ప్రారంభమయ్యాయి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమై నేటితో కులగణన తీర్మానంతో ముగియనున్నాయి. దాదాపు ఎనిమిది రోజుల పాటు సభ కొలువై అనేక అంశాలపై చర్చించింది. నిన్న కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదిక కూడా సమర్పించింది.