Telangana : మరో రెండు రోజులు భారీ వర్షాలే
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది
red alert for telangana
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అనేక చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలో వేగంగా విస్తరిస్తున్నాయి. రెండు మూడు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నైరుతి రుతుపవనాలు...
ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి నైరుతి రుతుపవనాలు ఇపపటికే విస్తరించాయి. ఈ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని అధికారులు తెలిపారు. ఇప్పటికే అనేకజిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని, ఈ రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.