Telangana : నేడు స్పీకర్ గడ్డం ప్రసాదరావు కీలక నిర్ణయం

తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాదరావు నేడు మరో ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హతపై తీర్పు చెప్పనున్నారు.

Update: 2026-01-15 04:42 GMT

తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాదరావు నేడు మరో ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హతపై తీర్పు చెప్పనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదని స్పీకర్ గడ్డం ప్రసాదరావు తీర్పు చెప్పారు. నేడు పార్టీ మారారంటున్న కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు సంబంధించి అనర్హత పిటీషన్ పై విచారణ తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాదరావు తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.

పది మంది ఎమ్మెల్యేల అనర్హతపై...
మొత్తం పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటీషన్లపై విచారణ కొనసాగాల్సి ఉంది. అయితే ఇందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ కు చెందిన కడియం శ్రీహరి అనర్హత పిటీషన్ లపై విచారణ చేయాల్సి ఉంది. అయితే నేడు ఇద్దరి ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పిటీషన్ కు సంబంధించి మాత్రమే స్పీకర్ గడ్డం ప్రసాదరావు తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.


Tags:    

Similar News