Telangana : నేడు స్పీకర్ ఎదుటకు తెల్లం

తెలంగాణ శాసనసభ స్పీకర్ నేడు పార్టీ మారిన ఎమ్మెల్యేలను విచారించనున్నారు

Update: 2025-11-18 02:39 GMT

తెలంగాణ శాసనసభ స్పీకర్ నేడు పార్టీ మారిన ఎమ్మెల్యేలను విచారించనున్నారు. ఇప్పటికే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందాయి. ఇందులో నలుగురు ఎమ్మెల్యేలను స్పీకర్ కార్యాలయంలో విచారణ జరిగింది. నేడు ఇద్దరు ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించనున్నారు.భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును నేడు స్పీకర్ గడ్డం ప్రసాదరావు విచారించనున్నారు.

రేపు ఇద్దరని...
రేపు పోచారం శ్రీనివాసరెడ్డి, అరికపూడి గాంధీలను కూడా విచారించనున్నారు. సుప్రీంకోర్టు నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేసి నిర్ణయం తీసుకోవాలన్న ఆదేశాలతో విచారణలో స్పీకర్ వేగం పెంచారు. ఇక వరసగా ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కానున్నారు. తర్వాత ఆయన అనర్హత పై నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ చాలా రోజుల క్రితం ప్రారంభమయింది. మరో నాలుగు వారాలే గడువు ఉండటంతో వరసగా ఎమ్మెల్యేలను విచారిస్తున్నారు.


Tags:    

Similar News