సుప్రీంకోర్టు తీర్పుపై స్పీకర్ ఏమన్నారంటే?
సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాదరావు స్పందించారు.
సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాదరావు స్పందించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై మూడు నెలల్లో విచారణ పూర్తి చేసి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్ ను ఆదేశించింది. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై ఆ పార్టీ నేతలు వేసిన పిటీషన్ పై విచారించిన న్యాయస్థానం ఈ తీర్పు చెప్పింది.
అన్ని వివరాలను త్వరలోనే...
మూడు నెలల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చిస్తానని స్పీకర్ గడ్డం ప్రసాదరావు తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు గతంలోనే నోటీసులు ఇచ్చామని ఆయన తెలిపారు. అన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తానని స్పీకర్ ప్రసాదరావు తెలిపారు.