Telangana : ఛార్జీలు పెంచిన తెలంగాణ ఆర్టీసీ

తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు పెంచింది

Update: 2025-08-09 04:44 GMT

తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు పెంచింది. ఈ నెల 11వ తేదీ వరకూ స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు పెంచుతున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ప్రయాణికులు తక్కువగా ఉండటంతో బస్సులు తిరగాల్సి రావడంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీకి తగినట్లుగా బస్సులను తిప్పుతున్నామని తెలిపింది.

స్పెషల్ సర్వీసుల్లో మాత్రమే...
ప్రయాణికులు లేకున్నా బస్సులు నడపాల్సి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఛార్జీలను పెంచుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అయితే స్పెషల్ బస్సులకు మాత్రమే ఈ ఛార్జీల పెంపుదల వర్తిస్తుందని తెలిపింది. ఈ నెల 11వ తేదీ తర్వాత తిరిగి స్పెషల్ బస్సుల్లోనూ ఛార్జీలు మామూలుగానే వసూలు చేస్తామని కూడా తెలిపింది.


Tags:    

Similar News

.