Telangana : షాకిచ్చిన ఆర్టీసీ.. పెరిగిన ఛార్జీలు
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సు పాస్ లను పెంచుతూ టీజీ ఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సు పాస్ లను పెంచుతూ టీజీ ఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. నెలవారీ బస్ పాస్ ఛార్జీలను ఇరవై శాతం పెంచుతూ టీజీ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పెరిగిన నెలవారీ బస్ పాస్ ల ఛార్జీలు రేపటి నుంచి అమలులోకి వస్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆర్టీసీ సాధారణ బస్సు సర్వీస్ లతో పాటు, మెట్రో బస్ సర్వీస్ ధరలను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
పెరిగిన ఛార్జీలు...
సాధారణ బస్సుసర్వీస్ బస్ పాస్ ల ధరలు పదకొండు వందల రూపాయల నుంచి పదమూడు వందల రూపాయలకు పెరిగింది. మెట్రో సర్వీస్ లకు సంబంధించి పథ్నాలుగు వందల ఉన్న బస్ పాస్ ధరలు పదిహేడు వందల వరకూ పెరిగాయి. దీంతో పెరిగిన ఛార్జీలను రేపటి నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రకటించారు.