Breaking : తెలంగాణ లో రికార్డు స్థాయిలో నేడు విద్యుత్తు డిమాండ్

తెలంగాణలో నేడు రికార్డు స్థాయిలో విద్యుత్తు డిమాండ్ నమోదయింది

Update: 2025-02-06 12:24 GMT

తెలంగాణలో నేడు రికార్డు స్థాయిలో విద్యుత్తు డిమాండ్ నమోదయింది. 15,752మెగావాట్ల విద్యుత్తును నేడు వినియోగించినట్లు విద్యుత్తు శాఖ అధికారులు వెల్లడించారు. గరిష్టంగా నేడు విద్యుత్తు డిమాండ్ ఫిబ్రవరి నెల మొదటి వారంలో నమోదయింది. ఇక రాను రాను విద్యుత్తు డిమాండ్ మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో...
ఎండలు ముదిరిపోవడంతో పాటు వేడి గాలుల తీవ్రత కూడా ప్రారంభం కానుండటంతో విద్యుత్తు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఏసీలు తిరిగి ఆన్ చేయడంతో పాటు ఫ్యాన్లు ఎక్కువగా వినియోగించడంతో పాటు ఉదయం వేళ చలిగాలులకు గీజర్ వాడకం కూడా పెరగడంతో గరిష్టంగా విద్యుత్తు డిమాండ్ నమోదయిందని అధికారులు చెబుతున్నారు.


Tags:    

Similar News