తెలంగాణలో హంగ్ రాబోతోందా?

తెలంగాణలో నవంబర్ 30 న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఫలితాలు

Update: 2023-10-21 10:51 GMT

తెలంగాణలో నవంబర్ 30 న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే తెలంగాణలో హంగ్ వస్తుందని చెబుతోంది. 119 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి సర్వే ఫలితాలను వెల్లడించింది. కాంగ్రెస్ 11శాతం ఓటు షేర్ పెంచుకుంటుందని, బీఆర్ఎస్ 9శాతం ఓటు షేర్ కోల్పోతుందని తెలిపింది. 39 శాతం ఓటు షేర్‌తో కాంగ్రెస్ పార్టీ 54 సీట్లు గెల్చుకుంటుందని ఆ సర్వే తెలిపింది. బీఆర్ఎస్ 38 ఓటు షేర్‌తో 49 సీట్లు గెలుచుకుంటుదని స్పష్టం చేసింది. బీజేపీ 8 స్థానాల్లో గెలుస్తుందని తెలిపింది. ఎఐఎంఐఎం 7 సీట్లు, బీఎస్పీ ఒక సీటు గెలుస్తుందని సర్వే చెబుతోంది. బీఆర్ఎస్ ఎంఐఎం మద్దతు తీసుకుంటే మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 56 కు చేరనుందని చెబుతోంది.

ఈ సర్వే ఫలితాలను తెలంగాణ కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేసింది. 'ఇండియా టుడే సంచలన సర్వే... కెసిఆర్ కు షాక్..! తెలంగాణలో కాంగ్రెస్ సభ... కొనసాగుతున్న కాంగ్రెస్ హవా !!' అని తెలిపింది. బీఆర్ఎస్ నేతలు మాత్రం తప్పకుండా తామే గెలుస్తామని చెబుతున్నారు. మూడో సారి కూడా కేసీఆర్ తెలంగాణ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 


Tags:    

Similar News