బీజేపీ ఎమ్మెల్యేల అరెస్ట్
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను తెలంగాణ పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను తెలంగాణ పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. బండి సంజయ్ ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ బీజేపీ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు రఘునందనరావు, రాజాసింగ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. తూప్రాన్ వద్ద రఘునందనరావును అదుపులోకి తీసుకున్నారు. రాజాసింగ్ ను మాత్రం ఆయన ఇంటి వద్ద హౌస్ అరెస్ట్ చేశారు.
కిషన్ రెడ్డి పరామర్శ....
కరీంనగర్ జైలు వద్ద బండి సంజయ్ ను పరామర్శించేందుకు వెళుతుండగా పోలీసులు తనను అరెస్ట్ చేసినట్లు రాజాసింగ్ తెలిపారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లు జైలులో ఉన్న బండి సంజయ్ ను పరామర్శించారు. అనంతరం ఎంపీ కార్యాలయానికి వెళ్లి పరిశీలించనున్నారు.