Harish Rao : మాది శ్రమ ఫలితం.. మీది శిలా ఫలకం
రుణమాఫీ చేయకుండానే సిద్ధిపేటకు ఎలా వస్తావని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరీశ్ రావు ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు.రుణమాఫీ చేయకుండానే సిద్ధిపేటకు ఎలా వస్తావని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరీశ్ రావు ప్రశ్నించారు. మాది శ్రమ ఫలితమని, మీది శిలా ఫలకమని హరీశ్ రావు అన్నారు. రైతులకు ఏం మేలు చేశావని సిద్ధిపేట వస్తున్నావని నిలదీశారు. రుణ మాఫీ కూడా నర్మెట్ట గ్రామంలో జరగలేదని, రైతు బంధు పథకం కూడా మూడు పంటలకు ఎగ్గొట్టారని హరీశ్ రావు అన్నారు. రేపు ఏ పంటకు రైతు బంధు ఇస్తారని ప్రశ్నించారు.
ఏ ముఖం పెట్టుకుని...
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తమ ప్రభుత్వం నీళ్లు సాగుకోసం ఇచ్చామని, రేపు అదే నీళ్లు నెత్తిమీద చల్లుకో అని ఎద్దేవా చేశారు. శిలాఫలకాలపై మీ పేరు ఉండవచ్చు కానీ, పామాయిల్ ఫ్యాక్టరీ ఎవరు ఏర్పాటు చేశారన్నది ప్రజల హృదయ ఫలకంపై ఉందని హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పూర్తయిన పనులకు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధిపేటకు వస్తున్నారంటూ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఏ ముఖం పెట్టుకుని సిద్ధిపేట వస్తున్నారని ప్రశ్నించారు.