సీఎం కేసీఆర్ కు ఏమైందో చెప్పాలంటూ లేఖ

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్యం గురించి తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతూ

Update: 2023-10-07 10:17 GMT

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్యం గురించి తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతూ ఉంది. ఆయన బాగానే ఉన్నారని మంత్రి కేటీఆర్ ఇప్పటికే చెప్పారు. అయితే ఆయనకు ఏమైందో చెప్పాలని మేడ్చల్ జిల్లాకు చెందిన సుంకర నరేష్ అనే వ్యక్తి ప్రభుత్వానికి లెటర్ రాశాడు. గత కొద్ది రోజులుగా సీఎం కేసీఆర్ పబ్లిక్ మీటింగ్ లో కనిపించడం లేదని.. కేసీఆర్ ఆరోగ్యంపై పూర్తి వివరాలతో కూడిన హెల్త్ బులిటెన్ విడుదల చేయాలంటూ చీఫ్ సెక్రటరీ శాంతికుమారికి లేఖ రాశారు. సీఎం కేసీఆర్​ ముందు వైరల్​ ఫీవర్​తో బాధపడ్డారు. ఇప్పుడు ఆయన చెస్ట్​ ఇన్​ఫెక్షన్​కు గురయ్యారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్​ శుక్రవారం మీడియాకు తెలిపారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చాతీలో ఇన్ఫెక్షన్ అయిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఓ టీవీ చానల్‌తో మంత్రి మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత చాతీలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ మొదలైందని అన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కోలుకుని త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని తెలిపారు. వైరల్ ఫీవర్ వల్ల సీఎం కేసీఆర్ గత 3 వారాలుగా ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రజలకు దూరంగా ఉంటున్నారు. వైద్యులు ఆయనకు ప్రగతి భవన్‌లో చికిత్స అందిస్తున్నారు. సీఎం కేసీఆర్ కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధ పడుతున్నారని, ప్రగతి భవన్‌లో ఐదుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోందని సెప్టెంబర్ 26న కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.


Tags:    

Similar News