Telangana : ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు
తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.
తెలంగాణ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. భారీ బందోబస్తు మధ్య పోలింగ్ జరగనుంది. అక్కడక్కడ కొద్దిపాటి సంఘటనలు మినహా తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ఇప్పటి వరకూ జరగనున్నాయి. రాష్ట్రంలో తొలి విడత జరుగుతున్న పోలింగ్ కు నాలుగు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో...
కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన అధికారులు అక్కడ అధిక సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటి వరకూ తక్కువగా పోలింగ్ శాతం నమోదయిందని, మిగిలిన జిల్లాల్లో మాత్రం పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలి వచ్చారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం కౌంటింగ్ ప్రారంభం కానుంది.