Telangana : బనకచర్లపై నేడు తెలంగాణలో అఖిలపక్ష సమావేశం

ఆంధ్రప్రదేశ్ నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై నేడు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు

Update: 2025-06-18 02:13 GMT

ఆంధ్రప్రదేశ్ నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై నేడు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. గోదావరి - బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఉత్తమ్ ఈ అఖిలపార్టీ సమావేశంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. బనకచర్ల ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తే తెలంగాణకు జరిగే నష్టాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించనున్నారు.

అన్ని పార్టీలకు చెందిన ఎంపీలను...
ఈ సమావేశానికి తెలంగాణలోని అన్ని పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులతో పాటు ముఖ్య నేతలను ఆహ్వానించారు. బనకచర్ల వల్ల కలిగే నష్టం తెలంగాణకు ఉండటంతో కేంద్రంలో దానిని అడ్డుకునేందుకు ప్రయత్నించాలని కోరనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అన్ని పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులు పాల్గొననున్నారు. బీఆర్ఎస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలను కూడా ఈ సమావేశఆనికి రావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు.


Tags:    

Similar News