మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్.. నీతి నిజాయితీ రాజకీయాలు నేర్పారన్నారు. కష్టపడితే రాజకీయాల్లో ఏదైనా సాధించవచ్చని చంద్రబాబు చూపించారు. రేవంత్ ఏ ఆధారం లేకుండా కిందిస్థాయి నుంచి ముఖ్యమంత్రి గా ఎదిగారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
త్వరలో రామాలయ విస్తరణ పనులు...
తాను నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర ఎవరినీ నొప్పించకుండా పనిచేశానని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. గత ప్రభుత్వంలో భద్రాద్రి రామాలయ అభివృద్ధి సాధ్యపడలేదన్న ఆయన త్వరలో రామాలయం విస్తరణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.