Telangana : నేడు తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల

నేడు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశముంది

Update: 2025-09-29 04:23 GMT

నేడు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశముంది. ఈ మేరకు అధికారులు సిద్ధమయ్యారు. సెప్టంబరు 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో పాటు ప్రభుత్వం కూడా తాము స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమని తెలిపింది. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు నేడు షెడ్యూల్ విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

తొలిదశలో ఎంపీటీసీ, జడ్పీటీసీ...
మొదటి విడతగా తెలంగాణలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు. దశలవారీగా ఎన్నికలను నిర్వహించనున్నారు. తర్వాత పంచాయతీ,మున్సిపల్ ఎన్నికలను నిర్వహిస్తారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రెండుదశల్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. బ్యాలట్ పద్ధతిలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ సిద్ధమయింది.


Tags:    

Similar News