Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జేఎన్టీయూలో జరిగిన "స్టాండ్ విత్ హర్" కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. పథకాలను ప్రవేశపెట్టామని తెలిపారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడమే కాకుండా, బస్సులకు మహిళలను యజమానులను చేసిన ఘనత కూడా తమ ప్రభుత్వానిదేనని అన్నారు.
మహిళల భద్రత కోసం...
మహిళ సంఘాల ద్వారా ఆర్టీసీలో వెయ్యి బస్సులను నడిపిస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో తెలంగాణదూసుకు పోతుందని, మహిళల పాత్ర కూడా అందులో ఉందని అన్నారు. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, రక్షణకు ప్రయారిటీ ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. గతంలో మహిళలపై వేధింపులు పట్టణాలకే పరిమితమయ్యేవని, ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించాయని రేవంత్ రెడ్డి అన్నారు. హైటెక్ సిటీ పక్కనే ఇందిర మహిళ స్టాల్స్ ను కేటాయించిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.