Klavakuntla Kavitha : హరీశ్ పై మరోసారి కవిత షాకింగ్ కామెంట్స్
మాజీ మంత్రి హరీశ్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి హరీశ్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమికి బీఆర్ఎస్ నేతలే కారణమని తెలిపారు. కృష్ణార్జునలమంటూ జబ్బలు చరచుకుంటున్న వారు సోషల్ మీడియాకే పరిమితమయ్యరన్నారు. కేటీఆర్ ఇప్పటికైనా సోషల్ మీడియాను వదిలేసి బయటకు రావాలని అన్నారు. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ లో ఓడిపోగానే ఓటమికి తాను కాదని తప్పించుకోవడం హరీశ్ రావు నైజాన్ని చాటి చెబుతుందని కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
పదిహేను మంది...
పదిహేను మంది స్వతంత్ర అభ్యర్థులు తన వద్దకు వచ్చి తాము నామినేషన్లను ఉపసంహరించుకుంటామని చెప్పారని, అయితే తాను బీఆర్ఎస్ లో లేనని చెప్పానని, హరీశ్ రావు కూడా అదే మాట వారితో అన్నారని కల్వకుంట్ల కవిత అన్నారు. హరీశ్ రావు పార్టీలోనే ఉంటూ ఆ పార్టీ ఓటమికి కారణమయ్యారని కవిత ఆరోపించారు. రాష్ట్ర మంతటా కాంగ్రెస్ పై వ్యతిరేకత కనిపిస్తున్నప్పటికీ జూబ్లీహిల్స్ లో ఓటమికి గల కారణాలను ఇప్పటికైనా నాయకత్వం వెతుక్కుంటే మంచిదని కల్వకుంట్ల కవిత హితవు పలికారు.