Kalvakuntla Kavitha : బీఆర్ఎస్ పై కవిత సంచలన ట్వీట్

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై సంచలన ట్వీట్ చేశారు

Update: 2025-11-14 12:44 GMT

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై సంచలన ట్వీట్ చేశారు. కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ఆమె ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఇటీవల కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ నాయకత్వం సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆమె బీఆర్ఎస్ ప్రాధమిక సభ్యత్వానికి, బీఆర్ఎస్ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం కల్వకుంట్ల కవిత తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు.

కర్మ హిట్స్ బ్యాక్ అంటూ...
అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలయిన తర్వాత కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ఏక వాక్యంతో తన మనసులో మాటను బయట పెట్టారు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదని, ఫలితం అనుభవించాల్సిందేనని కల్వకుంట్ల కవిత పరోక్షంగా బీఆర్ఎస్ నాయకత్వానికి చెప్పకనే చెప్పారు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదని కవిత కారు పార్టీ నాయకత్వానికి శాపనార్థాలు పెట్టినట్లయింది.


Tags:    

Similar News