అవయవదానంలో తెలంగాణ నెంబర్ 1

అవయవదానంలో తెలంగాణ రాష్ట్రం మరోసారి అగ్రస్థానానికి చేరుకుంది.

Update: 2025-08-04 11:45 GMT

అవయవదానంలో తెలంగాణ రాష్ట్రం మరోసారి అగ్రస్థానానికి చేరుకుంది. 2024 సంవత్సరానికి గాను దేశంలోనే అత్యధిక అవయవదానాలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ విడుదల చేసిన అధికారిక గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మరణానంతరం చేసే అవయవదానంలో తెలంగాణ దేశంలోనే ముందు వరుసలో ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'జీవన్‌దాన్' కార్యక్రమం ఇందుకు సంబంధించి కీలక పాత్ర పోషిస్తోంది. 2021లో 162 మంది దాతలు ఉండగా, 2022 నాటికి ఆ సంఖ్య 194కి పెరిగింది. 2023లోనూ తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. 'జీవన్‌దాన్' కార్యక్రమం కింద మరణించిన దాతల నుంచి కిడ్నీలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు వంటి కీలక అవయవాలను సేకరించి ఎంతోమందికి పునర్జన్మ ప్రసాదిస్తున్నారు.

Tags:    

Similar News