Telangana : తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల వర్షాలు

తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2024-11-30 04:47 GMT

తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆది, సోమవారాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అనేక ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడి వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ , హనుమకొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయని తెలిసింది.

ఆరెంజ్ అలెర్ట్...
ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, మహబూబ్ నగర్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మల్కాజ్ గిరి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రైతులు తమ ధాన్యం ఉత్పత్తులు కాపాడుకోవాలని అధికారులు సూచించారు. కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ తెలిపింది.


Tags:    

Similar News