Inter Results : ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విడుదల చేశారు. మొత్తం దాదాపు 9.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అయితే ఈ ఫలితాలను www.tebie,cgg.gov.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకునే వీలుంది.
బాలికలదే హవా...
ప్రధమ సంవత్సరంలో 66.89 శాతం ఉత్తీర్ణులయ్యారు. సెకండ్ ఇయర్ 71.27 శాతం మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యార. మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు జరిగాయి. మొదటి, ద్వితీయ సంవత్సరం ఇంటర్ పరీక్షల్లో బాలికలే ఎక్కువ శాతం మంది ఉత్తీర్ణులయ్యారని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.