Telangana: నేడు కాళేశ్వరం కమిషన్ పై విచారణ
తెలంగాణ హైకోర్టులో నేడు కాళేశ్వరం కమిషన్ నివేదికపై విచారణ జరగనుంది
తెలంగాణ హైకోర్టులో నేడు కాళేశ్వరం కమిషన్ నివేదికపై విచారణ జరగనుంది. ఈ పిటీషన్ ను చీఫ్ జస్టిస్ బెంచ్ లో విచారణకు వచ్చే అవకాశముంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక తప్పుల తడకగా ఉందని, ఏకపక్షంగా ఉందని బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.
వేర్వేరు పిటీషన్లు...
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావులు వేర్వేరుగా కాళేశ్వరం కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలంటూ పిటీషన్లు దాఖలు చేశారు. కమిషన్ నివేదికను రద్దు చేయాలని కూడా పిటీషన్ లో కోరారు. దీంతో దీనిపై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. ఈ పిటీషన్ విచారణ విషయంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.