Pawan Kalyan : ఓజీ.. క్యాజీ అన్న హైకోర్టు.. అంత భారీ షాకింగ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మూవీకి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మూవీకి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. టిక్కెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన మెమోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పుడు టిక్కెట్లను ఇప్పటికే కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. ఈరోజు రాత్రి పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మూవీ ప్రీమియర్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది.
అక్టోబరు 4వ తేదీ వరకూ...
నేటి నుంచి అక్టోబరు 4వ తేదీ వరకూ తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ లో వందరూపాయలు, మల్టీప్లెక్స్ లో 150 రూపాయలు పెంచుకుని అమ్ముకునేందుకు ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఇప్పటికే ఓజీ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మరికొద్ది గంటల్లో మూవీకి వెళ్లాల్సిన పరిస్థితుల్లో తీసుకున్న డబ్బు తిరిగి చెల్లిస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.