Telangana : జీఐ ఆన్ వీల్స్ పై గవర్నర్ ప్రశంసలు

"జీఐ ఆన్ వీల్స్" కార్యక్రమం నిర్వహించడం అభినందించ దగ్గ విషయమని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు

Update: 2026-02-27 08:19 GMT

దేశంలో ఎక్కడా జరగని విధంగా తొలిసారిగా "జీఐ ఆన్ వీల్స్" కార్యక్రమం నిర్వహించడం అభినందించ దగ్గ విషయమని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. జీఐ ఆన్ వీల్స్ కార్యక్రమం ఆలోచన గురించి తొలిసారిగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు చెప్పిన వెంటనే స్పందించారు.ఒక్కో బస్సు పై ఒక్కో ప్రత్యేక జీఐ వర్క్ తో విస్తృత ప్రచారం నిర్వహించడం అభినందనీయమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.

సంస్కృతి.. సంప్రదాయాలకు...
జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ అనేది మన చరిత్ర, గుర్తింపు, సంప్రదాయమని గవర్నర్ అన్నారు. జీఐ ట్యాగ్స్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, సమాజం అనేది ఫోన్లలోనో, ఇంటర్నెట్ లోనూ లేదని, మన సంస్కృతి నుంచి ముడిపడిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సంస్కృతిని, కళాకారులను, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఆయన తెలిపారు.


Tags:    

Similar News