తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభం.. ఎప్పటి నుంచి అంటే?

కరోనా కేసులు ఉదృతి తీవ్రంగా ఉన్నప్పటికీ తీవ్రత అంతగా లేకపోవడంతో విద్యాసంస్థలను తెరవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది.

Update: 2022-01-25 03:25 GMT

తెలంగాణలో పాఠశాలలను తెరిచేందుకు ప్రభుత్వం సిద్దమవుతుంది. కరోనా కేసులు ఉదృతి తీవ్రంగా ఉన్నప్పటికీ తీవ్రత అంతగా లేకపోవడంతో విద్యాసంస్థలను తెరవాలని భావిస్తుంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో విద్యాసంస్థలకు తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకూ సెలవులను ప్రకటించింది.

తీవ్రత తక్కువగా ఉండటంతో.....
అయితే విద్యాసంవత్సరం వృధా అవుతుండటం, కరోనా తీవ్రత అంతగా లేకపోవడంతో పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నెల 31వ తేదీ నుంచి లేకపోతే ఫిబ్రవరి మొదటి వారంలో పాఠశాలలను తెరవాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇప్పటికే మహారాష్ట్రలోనూ పాఠశాలలను ప్రారంభించారు. ఏపీలో పాఠశాలలు కొనసాగుతున్నాయి.


Tags:    

Similar News