Telangana : సీబీఐకి అనుమతి.. హోంశాఖకు లేఖ

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది.

Update: 2025-09-02 03:48 GMT

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. రెండు రోజుల క్రితంకాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై విచారించిన శాసనసభ ఈ కేసును దర్యాప్తు చేయడానికి సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది.

సీబీఐని అనుమతిస్తూ...
అయితే రాష్ట్రంలోకి సీబీఐకి అనుమతి లేకుండా గత కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోకి సీబీఐ విచారణను అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల కూడా జారీ చేసింది. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి నిజాలను నిగ్గుతేల్చాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర హోం శాఖకు లేఖ రాసింది.


Tags:    

Similar News