Telangana : చంద్రబాబు బాటలో రేవంత్.. కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నెలకు రెండుససార్లు మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నెలకు రెండుససార్లు మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు తాజాగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నెలకు రెండుసార్లు మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు.
నెలకు రెండుసార్లు...
ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నెలకు రెండుసార్లు మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. దీనివల్ల ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడంతో పాటు అవసరమైన ఆదేశాలను వెంటనే జారీ చేసేందుకు అవకాశం దొరుకుతుందని భావించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.