Telangana : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్ చెప్పింది
తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్ చెప్పింది. దసరా పండగ సందర్బంగా పెండింగ్ బిల్లులను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ బిల్లులను 104 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పంచాయతీ కార్యదర్శులకు...
ఇప్పటి వరకూ ఈ పెండింగ్ బిల్లుల కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే తెలంగాణ ప్రభుత్వం 104 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను విడుదల చేస్తూ ఉత్తర్వుల జారీ చేసింది. ఈరోజే పంచాయతీ కార్యదర్శుల ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నాయి.