Telangana : ఎన్నికల బరిలో మున్సిపల్ అభ్యర్థులు ఎంతమందంటే?

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.

Update: 2026-02-04 04:42 GMT

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మున్సిపల్ ఎన్నికల బరిలో 12,993 మంది అభ్యర్థులు నిలిచారు. తెలంగాణ మునిసిపల్‌ ఎన్నికల బరిలో 12,993 మంది అభ్యర్థులు నిలిచినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మునిసిపాలిటీల పరిధిలో 2,996 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రతి వార్డుకు సగటున నలుగురు అభ్యర్థుల చొప్పున పోటీ పడుతున్నారు. ఈ నెల 9తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నెల 11న పోలింగ్ జరుగనుంది. 13న ఫలితాలు వెల్లడిస్తారు.

ప్రశాంతంగా నిర్వహించాలని...
మున్సిపల్ ఎన్నికలను చట్ట ప్రకారం సమర్థవంతంగా నిర్వహించాలని డీజీపీ బి.శివధర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికలు జరగనున్న ప్రాంతాలకు సంబంధించిన పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఎస్హెచ్ఓలతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, 414 వార్డులతో పాటు 2,582 వార్డుల్లో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.


Tags:    

Similar News