తెలంగాణ విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు

విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలకు సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖను..

Update: 2023-07-20 16:04 GMT

భారీ వర్షాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రెండురోజులు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు. గురు, శుక్రవారాలు విద్యాసంస్థలకు భారీ వర్షాల నేపథ్యంలో సెలవు ప్రకటించారు. మరో మూడురోజుల పాటు తెలంగాణకు భారీ వర్షసూచన ఉన్న నేపథ్యంలో శనివారం వరకూ సెలవులు పొడిగిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. శుక్ర, శనివారాలు కూడా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నింటికీ సెలవులు ప్రకటించింది.

విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలకు సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ సెలవులు అత్యవసర విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు వర్తించవని స్పష్టం చేశారు. కాగా.. తెలంగాణలో నేటి రాత్రి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ఐఎండీ హెచ్చరించింది. హైదరాబాద్ లో సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడికక్కడ వర్షపునీరు రోడ్లపై నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి అవస్థలు పడుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు కనీస చర్యలు తీసుకోవట్లేదని వాపోతున్నారు.


Tags:    

Similar News