ఫోక్ సింగర్, తెలంగాణ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మృతి
తెలంగాణ ఫోక్ సింగర్ సాయిచంద్ హఠాన్మరణం
telangana folk singer saichand died at 39
తెలంగాణ ఫోక్ సింగర్, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ సాయిచంద్ (39) కన్నుమూశారు. గుండెపోటుతో అర్ధరాత్రి ప్రాణాలు కోల్పోయారు. బుధవారం సాయంత్రం కుటుంబంతో కలిసి కారుకొండలో తన ఫామ్‌హౌస్‌కి వెళ్లిన సాయిచంద్ అక్కడే గుండెపోటుకు గురయ్యారు. దీంతో హుటాహుటిన నాగర్‌కర్నూల్ గాయత్రి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్సకోసం గచ్చిబౌలి కేర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సాయిచంద్ చనిపోయినట్లు కేర్ వైద్యులు ప్రకటించారు. సింగర్ సాయిచంద్ మృతితో గచ్చిబౌలి కేర్ హాస్పిటల్‌కు బీఆర్ఎస్ ముఖ్యనేతలు చేరుకుంటున్నారు. మంత్రి హరీష్ రావు, బాల్క సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా ఇతర ప్రముఖ నేతలు ఇప్పటికే హాస్పిటల్‌కు చేరుకున్నారు. గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి భౌతికకాయం తరలించాలని భావిస్తున్నారు.