Telangana Budget : 2.75 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్

తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో 2024 -25 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు

Update: 2024-02-10 06:53 GMT

తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో 2024 -25 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2.75 లక్షల అంచనా వ్యయంతో రూపొందించిన బడ్జెట్ ను ఆయన సభ ముందు ఉంచారు. తెలంగాణ సమాజం గత ఎన్నికల్లో మార్పును కోరుకుందన్నారు. తమది ప్రజల ప్రభుత్వమని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు. తెలంగాణ లో ఎన్నికల సందర్భంగా తాము ఇందిరమ్మ రాజ్యం తెస్తామని మాట ఇచ్చామని తెలిపారు.

సంక్షేమానికి....
సమానత్వమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు. ఆరు గ్యారంటీలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఇందుకోసం 53,196 కోట్ల అంచనాలను రూపొందించారు. ఐటీ శాఖకు 774 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 40,080 కోట్లు కేటాయించారు. పరిశ్రమల శాఖకు 2,543 కోట్లు, మున్సిపల్ శాఖకు 11,692 కోట్లు కేటాయించారు. తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటు పడి పోయిందని చెప్పారు. 0.1 శాతంగా ఉందని తెలిపారు. తమ ప్రభుత్వం ఇటు సంక్షేమంతో పాటు అటు అభివృద్ధికి కూడా దృ‌ష్టి పెడుతుందన్నారు.
పన్నుల భారం మోపకుండా...
ప్రజలపై పన్నుల భారం మోపకుండా తెలంగాణలో అన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకునే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ద్రవ్యోలోటు 32,557 గా ఉందని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ద్రవ్యలోటు 5,944 గా ఉందని తెలిపారు. వ్యవసాయ శాఖకు 16,746 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. మైనారిటీల సంక్షేమం కోసం 2,262 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. ప్రగతి భవన్ ను పూలే భవన్ గా మార్చామని చెప్పారు.


Tags:    

Similar News