Telangana : నేడు తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ డీఎస్సీ ఫలితాలను విడుదల చేయనున్నారు
Telangana DSC results 2024
తెలంగాణ డీఎస్సీ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ డీఎస్సీ ఫలితాలను విడుదల చేయనున్నారు. మొత్తం 11,062 పోస్టులకు సంబంధించి మార్చి 1వ తేదీన డీఎస్సీ నోటిఫికేసన్ విడుదలయింది. జులై 18వతేదీ నుంచి ఆగస్టు వరకూ విడతల వారీగా పరీక్షలు నిర్వహించారు.
మొత్తం 2.45 లక్షల మంది...
మొత్తం 2.45 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో ఎవరు డీఎస్సీ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధిస్తారనోనన్న ఉత్కంఠ అభ్యర్థుల్లో నెలకొంది. తొలుత అభ్యర్థుల మెరిట్ లిస్ట్ ప్రకారం ప్రకటిస్తారు. అనంతరం డీఈవో కార్యాలయాల్లో అభ్యర్థుల సర్టిఫికేట్లనను పరిశీలిస్తారు. సర్టిఫికేట్ల వెరిఫిికేషన్ అనంతరం నియామకపత్రాలను అందచేస్తారు.