Telangana : నేడు మల్లు భట్టి కీలక సమావేశం

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

Update: 2025-09-19 03:50 GMT

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో నేడు ఉన్నతాధికారుల సమావేశం కానున్నారు. ఉదయం పదకొండు గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. తెలంగాణలో ప్రాజెక్ట్‌లు, సంక్షేమకార్యక్రమాలపై చర్చించనున్నారు.

ప్రాజెక్టులు, సంక్షేమంపై...
తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుల పురోగతిపై నీటిపారుదలశాఖ అధికారులతోనూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చర్చిస్తారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల వివరాలు, ఇంకా నిధులు ఏ మేరకు కేటాయిస్తే ప్రాజెక్టులు పూర్తవుతాయన్న దానిపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై కూడా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులతో చర్చిస్తారు. అర్హులైన అందరికీ పథకాలను అందచేయాలని ఆదేశించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొననున్న మంత్రులు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబుతో పాటు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.


Tags:    

Similar News