మెగా డీఎస్సీపై సంచలన ప్రకటన

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పారు

Update: 2024-02-27 14:00 GMT

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పారు. మెగా డీఎస్సీపై సంచలన ప్రకటన చేశారు. నిరుద్యోగుల గురించి కేసీఆర్ ఏనాడు ఆలోచించలేదని.. కేవలం తన కుటుంబసభ్యులకు మాత్రమే అందరికీ ఉద్యోగాలు ఇప్పించుకున్నాడని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే 25 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని చెప్పారు. త్వరలోనే మెగా డీఎస్సీ వేసి భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

మంగళవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ‘జన జాతర’ పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తల త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోనని.. వాళ్ల రుణం తీర్చుకొని తీరుతానని మాటిచ్చారు. సోనియా గాంధీ సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణకు వచ్చి ఆరు గ్యారంటీలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లో రెండు కీలక హామీలు అమలు చేశామని అన్నారు. ఇప్పుడు మరో రెండు గ్యారంటీలు అమలు చేశామని తెలిపారు. ఇచ్చిన మాటను అటు సోనియా గాంధీ, ఇటు కాంగ్రెస్ పార్టీ ఏనాడూ తప్పలేదని గుర్తుచేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. పేద ప్రజలు సైతం పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి చికిత్సలు చేయించుకుంటున్నారని అన్నారు.


Tags:    

Similar News