Breaking : శాంతి కుమారికి రేవంత్ మరో పదవి
తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారిని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ బాధ్యతలను అప్పగించారు
తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారిని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ బాధ్యతలను అప్పగించారు. శాంతకుమారి చీఫ్ సెక్రటరీగా ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. శాంతకుమారి స్థానంలో రామకృష్ణారావును కొత్త చీఫ్ సెక్రటరీగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
శాంతి కుమారి సేవలను...
అయితే పదవీ విరమణ చేసిన శాంతికుమారి సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసమే మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ బాధ్యతలను అప్పగించింది. దీంతో పాటు జయేష్ రంజన్ ను తన ముఖ్యమంత్రి కార్యాలయంలోకి తీసుకున్నారు. పాలనలో ప్రక్షాళనలో భాగంగా ఐఏఎస్ లను ఇరవై మందిని నిన్న బదిలీ చేసిన సంగతి తెలిసిందే.