Revanth Reddy : ముఖ్యమంత్రి మార్పుపై ప్రచారానికి రేవంత్ బ్రేక్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పదవి మార్పుపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు

Update: 2025-03-13 07:39 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పదవి మార్పుపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏంటో పార్టీ హైకమాండ్ కు తెలుసునని, తన గురించి ఏమీ తెలియకుండానే పీసీసీ చీఫ్ గా చేశారా? లేక ముఖ్యమంత్రిని చేశారా? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియాతో జరిగిన చిట్ చాట్ లో ఆయన ఈ విషయాలను ప్రస్తావించారు.

బలమైన సంబంధాలు...
పీసీసీ చీఫ్ ఎంపిక విషయంలోనూ తనతో సంప్రదింపులు జరిపారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పి పాలన చేయాలన్నదే తన అభిప్రాయమని రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబంతో తనకు బలమైన సంబంధాలున్నాయన్న రేవంత్ రెడ్డి ఇటువంటి ప్రచారాలను తాను పట్టించుకోనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెిపారు.


Tags:    

Similar News