Telangana : తెలంగాణాకు భారీ పెట్టుబడులు.. దిగ్జజ కంపెనీల రాక

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం జపాన్ లో పర్యటిస్తుంది. భారీ పెట్టుబడులను సాధించింది

Update: 2025-04-18 13:10 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం జపాన్ లో పర్యటిస్తుంది. నేడు టోక్యోలో పర్యటించిన రేవంత్ బృందం వివిధ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమయింది. దీంతో పాటు టోక్యోలో నిర్వహించిన జపాన్, - ఇండియా రోడ్ షోలో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జపాన్ కు చెందిన దిగ్గజ కంపెనీలతో సమావేశమైన రేవంత్ రెడ్డి బృందం భారీ పెట్టుబడులను సాధించింది. ప్రతినిధులతో సమావేశమై తెలంగాణలో నెలకొన్న సానుకూల పరిస్థితులను వివరించారు. తమ ప్రభుత్వం అందించే పారిశ్రామిక రాయితీలను కూడా వారికి తెలిపి తమ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటూ ఆహ్వానించారు.

పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో...
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తలకు ఫ్యూచర్ సిటీతో పాటు మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వివరించారు. ఫ్యూచర్ సిటీలో పరిశ్రమల ఏర్పాటు అనువైన భూమిని కేటాయిస్తామని చెప్పారు. దానికి మెట్రో సేవలను కూడా విస్తరిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిశ్రామిక వేత్తలకు తెలిపారు. దీంతో కొందరు పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు.
పదివేల ఐదు వందల కోట్ల రూపాయలతో...
ప్రధానంగా పదివేల ఐదు వందల కోట్ల రూపాయలతో డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఎన్టీటీ, డేటా,నెయిసా సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి సమక్షంలోనే ఈ ఒప్పందాలుజరిగాయి. దీనివల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరోవైపు రుద్రారంలో 562 కోట్ల రూపాయలతో పరిశ్రమను ఏర్పాటుచేయడానికి తోషిబా సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.ఎంవోయూలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. పరిశ్రమలకు అవసరమైన భూమితో పాటు విద్యుత్తు సరఫరాతో పాటు కనెక్టివిటీ కూడా కల్పిస్తామన్న ముఖ్యమంత్రి హామీ మేరకు పెద్దయెత్తున పెట్టుబడులు తరలి రానున్నాయి. నిజంగా ఇది తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి.


















Tags:    

Similar News