లబ్దిదారుల ఎంపికపై నేడు రేవంత్ సమీక్ష

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నాలుగు సంక్షేమ పథకాలపై సమీక్ష చేయనున్నారు

Update: 2025-01-25 03:59 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నాలుగు సంక్షేమ పథకాలపై సమీక్ష చేయనున్నారు. కమాండ్ కంట్రోల్ రూంలో ఆయన అధికారులతో సమీక్ష చేయనున్నారు. నిన్నటితో తెలంగాణ వ్యాప్తంగా గ్రామసభలు ముగియడంతో నేడు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియపై ఆయన సమీక్ష చేసి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

గ్రామసభలు పూర్తికావడంతో...
గ్రామసభల్లో గొడవలు జరగడం, లబ్దిదారులు ఎక్కువ మంది తమ పేర్లు లేవంటూ ఆందోళనకు దిగడంతో గ్రామసభలు రసాభాసాగా మారాయి. దీనిపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచనలు చేయనున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి నాలుగు సంక్షేమ పథకాలను అమలు చేయనున్నారు. మరోవైపు దావోస్ పర్యటనపై కూడా నేడు రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించనున్నారు.


Tags:    

Similar News