Revanth Reddy : నేడు హైదరాబాద్ కు రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు హైదరాబాద్ కు చేరుకోనున్నారు.

Update: 2025-04-23 04:31 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు హైదరాబాద్ కు చేరుకోనున్నారు. జపాన్ పర్యటనను ముగించుకుని ఆయన హైదరాబాద్ కు చేరుకుంటారు. గత వారం రోజుల నుంచి రేవంత్ రెడ్డి బృందం జపాన్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జపాన్ పర్యటనలో పలు పారిశ్రామిక సంస్థలతో రేవంత్ రెడ్డి బృందం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.

పెట్టుబడుల కోసం...
దీంతోపాటు అనేక విషయాలపై అవగాహనకు వచ్చారు. ప్రధానంగా మూసీ రివర్ ప్రాజెక్టు, ఫోర్త్ సిటీ వంటి వాటిని చెప్పి పారిశ్రామికవేత్తలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రేవంత్ రెడ్డి బృందం సక్సెస్ అయింది. నేడు రేవంత్ రెడ్డి తో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అధికారులు హైదరాబాద్ చేరుకోనున్నారు. పెట్టుబడులు భారీగా రావడంతో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ప్రభుత్వం చెబుతుంది.


Tags:    

Similar News