Telangana : నేడు జార్ఖండ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జార్ఖండ్ కు బయలుదేరి వెళ్లనున్నారు. శిబూ సోరెన్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు

Update: 2025-08-16 02:40 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జార్ఖండ్ కు బయలుదేరి వెళ్లనున్నారు. ఉదయం పదకొండు గంటలకు ఆయన జార్ఖండ్ కు బయలుదేరి వెళతారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ మరణించిన పన్నెండో రోజు కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించనున్నారు.

శిబు సోరెన్ కుటుంబానికి పరామర్శ...
కాంగ్రెస్ తో జార్ఖండ్ ముక్తి మోర్చా కు ఉన్న సంబంధాల దృష్ట్యా మాత్రమే కాకుండా ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడేందుకు శిబు సోరెన్ సహకరించడం కూడా రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రత్యేకంగా ఆయనకు కృతజ్ఞతలు గతంలో తెలిపారు. శిబూ సోరెన్ ను పరామర్శించిన అనంతరం తిరిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకుంటారు.


Tags:    

Similar News