Revanth Reddy : నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటిస్తారు

Update: 2025-07-07 02:23 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సమావేశమై ఎరువుల కొరతపై చర్చించనున్నారు. రాష్ట్రాలనికి రావాల్సిన ఎరువల కోటాను విడుదల చేయాలని కోరి రాష్ట్రానికి సరిపడా ఎరువులను పంపించాలని వినతి పత్రాన్ని సమర్పించనున్నారు.

పార్టీ నేతలను కలసి...
దీంతోపాటు మెట్రో రెండో దశ విస్తరణ పనులపై కూడా కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశముంది. మరొక వైపు కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. ఈ నెల 14న సూర్యాపేట తుంగతుర్తితో జరగనున్న బహిరంగ సభకు హాజరు కావాలని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలను ఆహ్వానించనున్నారు. కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడానికి ప్రభుత్వం ఈ నెల 14న భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరనున్నారు. రెండు రోజుల పాటు రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండనున్నారు.


Tags:    

Similar News