Revanth Reddy : నేడు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు, రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉంటారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు, రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉంటారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణలో అమలు చేసిన విధంగానే కాంగ్రెస్ ను ఇక్కడ గెలిపిస్తే ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఓటర్లకు చెప్పనున్నారు.
మూడు రోజుల్లో ఎన్నికలు...
ఢిల్లీలో ఎన్నికలు మరో మూడు రోజుల్లో జరగనుండటంతో ఎన్నికల ప్రచారం ఇప్పటికే ఊపందుకుంది. ప్రతి ఓటు కీలకం కావడంతో తెలుగు ఓటర్లను కూడా తమ వైపునకు తిప్పుకునేందుకు అన్ని పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి. అందుకోసమే రేవంత్ రెడ్డి కొన్ని ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరనున్నారు.