Revanth Reddy : హైదరాబాద్ కు ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులా? నిరుద్యోగులకు గుడ్ న్యూస్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జపాన్ పర్యటనను ముగించుకుని హైదరాబాద్ కు చేరుకోనున్నారు.

Update: 2025-04-23 05:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు హైదరాబాద్ కు చేరుకోనున్నారు. జపాన్ పర్యటనను ముగించుకుని ఆయన హైదరాబాద్ కు చేరుకుంటారు. గత కొన్ని రోజుల నుంచి రేవంత్ రెడ్డి బృందం జపాన్ లో పర్యటిస్తున్ననేపథ్యంలో పెద్దయెత్తున పెట్టుబడులను సాధించింది. జపాన్ లో జరుగుతున్న పారిశ్రామిక ఎక్స్ పో లోకూడా తెలంగాణ పెవిలియలన్ రేవంత్ రెడ్డి ప్రారంభించి అక్కడి పారిశ్రామిక వేత్తలను ఆకట్టుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నించారు. జపాన్ పర్యటనలో పలు పారిశ్రామిక సంస్థలతో రేవంత్ రెడ్డి బృందం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.

పెట్టుబడుల కోసం...
దీంతోపాటు అనేక విషయాలపై అవగాహనకు వచ్చారు. ప్రధానంగా మూసీ రివర్ ప్రాజెక్టు, ఫోర్త్ సిటీ వంటి వాటిని చెప్పి పారిశ్రామికవేత్తలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రేవంత్ రెడ్డి బృందం సక్సెస్ అయింది. నేడు రేవంత్ రెడ్డి తో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అధికారులు హైదరాబాద్ చేరుకోనున్నారు. పెట్టుబడులు భారీగా రావడంతో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ప్రభుత్వం చెబుతుంది. టోక్కో, ఒకాసోలో పర్యటించిన రేవంత్ రెడ్డి బృందం వివిధ అంశాలపై అధ్యయనం చేయడమే కాకుండా ఈకో టౌన్ ఏర్పాటుపై కూడా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఈరోజు రాత్రికి...
ఈరోజు రాత్రి 8:10 గంటలకు హైదరాబాద్‌ కు రేవంత్ రెడ్డి బృందం చేరుకోనుంది. జపాన్ కంపెనీలతో దాదాపు12,062 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకుంది. ఈ పెట్టుబడులతో 30,500 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. దావోస్‌ పర్యటనలో 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చిన రేవంత్ రెడ్డి బృందం.. అమెరికా, సింగపూర్, దక్షిణ కొరియా పర్యటనలో తెలంగాణకు 14,900 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపింది. 2024 దావోస్‌ పర్యటనలో నలభై వేల కోట్ల పెట్టుబడులు తీసుకు వచ్చారు. ఇప్పటివరకు తెలంగాణకు రూ.2,44,962 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. దీంతో తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ ను మోసకొచ్చినట్లయింది.


Tags:    

Similar News