Revnanth Reddy : నేటి నుంచి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. రెండేళ్ల ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ సభల్లో పాల్గొంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తుండటంతో వారోత్సవాలను జరపాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన సాగుతుంది.
నేడు మక్తల్ నియోజకవర్గంలో...
ఈ జిల్లాల పర్యటనల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభల్లో పాల్గొంటారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఏమేం అమలు చేశమో చెప్పనున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మక్తల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన సాగుతుంది. అక్కడ జరిగే సభలో పాల్గొంటారు.