Revanth Reddy : నేడు ప్రజాభవన్ బీసీ నేతలతో రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రజాభవన్ లో బీసీ నేతలతో భేటీ కానున్నారు

Update: 2025-02-22 02:14 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రజాభవన్ లో బీసీ నేతలతో భేటీ కానున్నారు. ఉదయం పదకొండు గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. కులగణన పై బీసీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించే అవకాశముంది. దీంతో పాటు త్వరలో ప్రారంభమ్యే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తీర్మానం చేయనుంది.

రిజర్వేషన్ల అంశంపై...
ఈ తీర్మానం పై అనుసరించాల్సిన వ్యూహం పై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ నేతలతో చర్చించనున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లుఅమలు చేయడం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రుల కూడా పాల్గొననున్నారు.


Tags:    

Similar News