Revanth Reddy : మరోసారి హరీశ్ రావుపై ఫైర్ అయిన రేవంత్

హైదరాబాద్ కు గోదావరి నుంచి నీళ్లు తెచ్చేది కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కాదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు

Update: 2025-09-08 12:07 GMT

హైదరాబాద్ కు గోదావరి నుంచి నీళ్లు తెచ్చేది కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కాదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకు వస్తున్నామని తెలిపారు. నాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులే నేడు ప్రజల దాహార్తిని తీర్చడమే కాకుండా, సాగునీటిని అందిస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం కూలేశ్వరం అయిందని అన్నారు. మూసీని పునరుజ్జీవం చేస్తామని తెలిపారు. మూసీని పట్టి పీడిస్తున్న కాలుష్యాన్ని తరిమికొడతామని రేవంత్ రెడ్డి అన్నారు. ఇవి కాళేశ్వరం నీళ్లు అని ఒకాయన చెబుతున్నారని, తాటిచెట్టులాగా పెరిగిండు కానీ, బుద్ధిపెరగలేదని పరోక్షంగా హరీశ్ రావుపై విమర్శలను రేవంత్ రెడ్డి చేశారు.

మూసీ పునరజ్జీవానికి...
రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగింది బీఆర్ఎస్ వల్లనేనని అన్నారు. త్వరలో మహారాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా మాట్లాడతానని తెలిపారు. మూసీని పునరుజ్జీవం చేసుకుంటే ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామని రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పటికీ మూసిని పట్టించుకోలేదని అన్నారు. మూడేళ్లలో ఈ నగరాన్ని ప్రపంచస్థాయిలో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుకుంటామని చెప్పారు. అందరూ కలసి రావాలని, పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.


Tags:    

Similar News