Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం 11 గంటలకు బంజారాహిల్స్‌లో ఏఐజీ హాస్పిటల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.
విద్యాశాఖ, అటవీ శాఖ...
విద్యాశాఖలో తీసుకు రావాల్సిన సంస్కరణలతో పాటు విద్యార్థులకు అందించే నాణ్యమైన భోజనంతో పాటు పాఠశాలల్లో కనీస సదుపాయాలను కల్పించడంపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలుతీసుకోవాలని అధికారులను ఆదేశించనున్నారు. ఈరోజు సాయంత్రం 5.30కు అటవీ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.