Revanth Reddy : తెలంగాణ మరో పంజాబ్ లా మారకముందే.. రేవంత్ సంచలన కామెంట్స్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ వినియోగంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ వినియోగంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో డ్రగ్స్ వినియోగం పెరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం నుంచి యువతను బయటపడేయాలంటే వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ వినియోగంలో త్వరలోనే పంజాబ్ ను మించిపోయేలా ఉందని ఆవేదన చెందారు.
డ్రగ్స్ వినియోగం వల్ల...
డ్రగ్స్ వినియోగం వల్ల జరిగే హానిని అవగాహన కల్పించాలని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇందుకు అందరి సహకారం అవసరమన్న ఆయన నిరుద్యోగం యువతను పెడదారి పట్టిస్తుందని, అందుకే రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా అర్హులైన వారందరికీ నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల రుణాన్ని అందిచనున్నట్లు తెలిపారు. దీనివల్ల స్వయం ఉపాధి పొందవచ్చని, ఇందుకోసం తమ ప్రభుత్వం ఆరువేల కోట్ల రూపాయలను కేటాయించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.